స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమే..కానీ: ఎమ్మెల్యే నంబూరి

ABN , First Publish Date - 2020-11-19T18:48:34+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్దంగానే ఉన్నామని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్‌రావు స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమే..కానీ: ఎమ్మెల్యే నంబూరి

గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్దంగానే ఉన్నామని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్‌రావు స్పష్టం చేశారు. అయితే  ప్రజలు ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తుందని చెప్పుకొచ్చారు. దీనిపై చంద్రబాబు కావాలని  దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. కోర్టుల ద్వారా చంద్రబాబు ప్రజల సంక్షేమ పధకాలను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. 


గోదావరి పెన్నా అనుసంధాన కాలువకు పెదకూరపాడు నియోజకవర్గంలో 1770 ఎకరాల భూమి అవసరమన్నారు. నష్టపరిహారం పెంచమని రైతులు అడిగారని... రైతుల డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సీఎం రైతు పక్షపాతి అని... సానుకూలంగా స్పందిస్తారన్నారు. రైతులు కూడా భూసేకరణకు సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 9 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు కొత్త జిల్లాకు మద్దతిస్తామని తెలిపారు. పల్నాడు జిల్లానా, నర్సరావుపేట జిల్లానా అనేది ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి తెలియజేస్తామని ఎమ్మెల్యే నంబూరి శంకర్‌రావు వెల్లడించారు. 

Updated Date - 2020-11-19T18:48:34+05:30 IST