గృహ నిర్మాణాల్లో పారదర్శకత పాటించాలి

ABN , First Publish Date - 2020-11-28T04:37:59+05:30 IST

ఇంటి స్థలాల పంపిణీతో పాటు గృహ నిర్మాణాల్లో అఽధికారులు పారదర్శకత పాటించాలని ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా అధికారులకు సూచించారు.

గృహ నిర్మాణాల్లో పారదర్శకత పాటించాలి
అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా తదితరులు

ఎమ్మెల్యే ముస్తఫా 

గుంటూరు, నవంబరు 27: ఇంటి స్థలాల పంపిణీతో పాటు గృహ నిర్మాణాల్లో అఽధికారులు పారదర్శకత పాటించాలని ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో శుక్రవారం ఆయన గృహనిర్మాణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలో ఏటుకూరు, బుడంపాడు, కొర్నెపాటు, అనంతవరప్పాడు ప్రాంతాల్లో ఇళ్ళస్థలాలు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 26,354 మంది లబ్ధిదారులు కాగా తొలి దశలో 9,917 మందికి ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.  


Read more