చిరు వ్యాపారులకు ’జగనన్నతోడు’

ABN , First Publish Date - 2020-11-26T05:02:00+05:30 IST

చిరువ్యాపారులు అధికవడ్డీల ఊబిలో చిక్కుకోకుండా సీఎం జగన్మోహన్‌రెడ్డి జగనన్నతోడు పథకంతో వడ్డీలేకుండా రూ.10వేలు అందజేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు.

చిరు వ్యాపారులకు ’జగనన్నతోడు’
చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌ తదితరులు

ఎమ్మెల్యే ముస్తఫా

గుంటూరు, నవంబరు 25: చిరువ్యాపారులు అధికవడ్డీల ఊబిలో చిక్కుకోకుండా సీఎం జగన్మోహన్‌రెడ్డి జగనన్నతోడు పథకంతో వడ్డీలేకుండా రూ.10వేలు అందజేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు.  మార్కెట్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌లు చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులను అందజేసి సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి వడ్డీలేకుండా రూ.10వేలు వరకు చిరువ్యాపారులకు అందజేస్తారని, ఆ 10వేలు చెల్లించాక మరో రూ. 20వేలు అందజేసే వెసులుబాటు ఉందన్నారు. గిరిధర్‌ మాట్లాడుతూ వడ్డీ మాఫియాలో చేతిలో పడకుండా చిరువ్యాపారులకు ఇదొక వరం లాంటిదన్నారు. అనంతరం సంగడిగుంట లాంచెస్టర్‌ రోడ్డులో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కృష్ణబలిజ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కోలా భవాని, జీఎంసీ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు షౌకత్‌, శ్రీనివాసరావు, వేముల జ్యోతి, మార్కెట్‌ ఆబు, రవి అజయ్‌, కీసరి సుబ్బులు తదితరులున్నారు. 

Read more