అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-11-14T03:52:07+05:30 IST
సమాజంలో అన్నివర్గాల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు.
గుంటూరు, నవంబరు 13: సమాజంలో అన్నివర్గాల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు. ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు పేరుతో తలపెట్టిన పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఏటుకూరు రోడ్డులోని డీఎస్‌నగర్, వర్కర్స్ కాలనీ, ఉడా రోడ్డు, ఇందిరాకాలనీ, ఐపీడీ కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, నాయకులు కావటి మనోహర్‌నాయుడు, గులాం రసూల్, షౌకత్, వేముల జ్యోతి, పర్జానా, రబ్బాని, నాగేశ్వరరావు, అంకమ్మరావు, రమణి తదితరులు పాల్గొన్నారు.