ముస్లింల సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2020-12-20T05:02:34+05:30 IST

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ పేర్కొన్నారు.

ముస్లింల సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే గిరిధర్‌ సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తున్న నూతన కమిటీ సభ్యులు

ఎమ్మెల్యే గిరిధర్‌ 

గుంటూరు, డిసెంబరు 19: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని అబుల్‌కలాం ఉర్దూ ఘర్‌, షాదీఖానా నూతన కమిటీ సభ్యులు షరీఫ్‌, ఫర్యాజ్‌, షేక్‌ షఫీ, షేక్‌ గౌస్‌, పర్వీన్‌, నజీర్‌ల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం జరిగింది. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, నాయకులు టీఎల్‌వీ వీరాంజనేయులు, గనిక ఝాన్సీరాణి, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T05:02:34+05:30 IST