తహసీల్దార్‌పై దురుసు ప్రవర్తన

ABN , First Publish Date - 2020-08-16T13:56:50+05:30 IST

మండలంలోని కొత్తలూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు దావులూరి..

తహసీల్దార్‌పై దురుసు ప్రవర్తన

శావల్యాపురంలో వైసీపీ నేత నిర్వాకం

పోలీసు కేసు నమోదు


శావల్యపురం(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తలూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు దావులూరి శ్రీనివాసరావు గత సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులపై వాగ్వాదానికి దిగి దూషించిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ నెల 10వతేదీ సాయంత్రం ధ్రువీకరణ పత్రంపై సంతకం విషయంలో కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావుకు వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండడంతో రేపు రావాలని తహసీల్దార్ సూచించారు. దీంతో శ్రీనివాసరావు ఆగ్రహంతో తహసీల్దార్ను, సిబ్బందిని దూషించాడు. దీంతో తహసీల్దార్ సుజాత, సిబ్బంది శ్రీనివాసరావుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ స్వర్ణలత కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-16T13:56:50+05:30 IST