55,714 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2020-12-29T06:22:19+05:30 IST
మిర్చియార్డుకు సోమవారం మొత్తం 63,611 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 55,714 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా యార్డులో 57,881 టిక్కీలు నిల్వ ఉన్నాయి.
గుంటూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు సోమవారం మొత్తం 63,611 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 55,714 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా యార్డులో 57,881 టిక్కీలు నిల్వ ఉన్నాయి. సోమవారం యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్టంగా రూ.6,000, గరిష్టంగా రూ.9,800, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.6,000, రూ.14,000, నాన్ ఏసీ తెల్లకాయలకు రూ.3,000, రూ.4,500 ధర లభించింది. ఏసీ కామన్ వెరైటీలకు రూ.7,000, రూ.16,000, ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.7,000, రూ.17,500, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,500 ధర లభించినట్లు సెక్రెటరీ ఎం.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.