-
-
Home » Andhra Pradesh » Guntur » mirchi
-
15,320 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2020-11-26T04:57:36+05:30 IST
మిర్చియార్డుకు బుధవారం మొత్తం 15,663 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 15,320 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

గుంటూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు బుధవారం మొత్తం 15,663 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 15,320 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా యార్డులో 27,292 టిక్కీలు నిల్వ ఉన్నాయి. బుధవారం యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 6,000, గరిష్టంగా రూ. 9,800, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ. 6,000, రూ. 14,000, నాన్ ఏసీ తెల్లకాయలకు రూ. 3,000, రూ. 4,500 ధర లభించింది. ఏసీ కామన్ వెరైటీలకు రూ. 7,000, రూ. 16,700, ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ. 7,000, రూ. 17,000, ఏసీ తెల్లకాయలకు రూ. 4,000, రూ. 7,600 ధర లభించినట్లు సెక్రెటరీ ఎం.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.