-
-
Home » Andhra Pradesh » Guntur » MIRCH YARD SHUT DOWN
-
నేటి నుంచి మిర్చియార్డు మూత
ABN , First Publish Date - 2020-03-23T08:38:44+05:30 IST
కరోనా ఎఫెక్ట్ మిర్చి యార్డుపై కూడా పడింది. సోమవారం సాయంత్రం నుంచి యార్డును మూసి వేయనున్నారు. కరోన వైరస్ వ్యాప్తిని...

గుంటూరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా ఎఫెక్ట్ మిర్చి యార్డుపై కూడా పడింది. సోమవారం సాయంత్రం నుంచి యార్డును మూసి వేయనున్నారు. కరోన వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన దృష్ట్యా యార్డు పాలకవర్గం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఆదివారం రాత్రి వరకు వచ్చిన మిర్చి టిక్కీలను సోమవారం సాయంత్రం వరకు ట్రేడింగ్ అనుమతించి ఆ తర్వాత యార్డు గేట్లను మూసి వేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రైతులు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్లు యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు.