మిర్చి రైతులకు నష్టాల ఘాటు

ABN , First Publish Date - 2020-12-02T05:16:15+05:30 IST

నివర్‌ తుపాను జిల్లాలోని మిరప రైతుల వెన్ను విరిచింది. మిరప పంటకు వర్షాల వల్ల అపార నష్టం వాటి ల్లింది. ఉరకెత్తిన మిరప ఎండిపోతున్నది.

మిర్చి రైతులకు నష్టాల ఘాటు
ఉరకెత్తి ఎండిపోతున్న మిరప పంట

వర్షం.. వైరస్‌తో మిర్చికి దెబ్బ

దిక్కుతోచని స్థితిలో రైతులు

అపార నష్టం.. అరకొరగానే అంచనా

మారిన వాతావరణంతో పెరగనున్న  తెగుళ్లు 


వైరస్‌.. వర్షాలు.. మిర్చికి అపార నష్టం చేశాయి. వేలాది ఎకరాలలో పంట దెబ్బతిన్నది. పంటను కోల్పోయిన రైతులు కన్నీటి పర్యంత మవుతున్నారు. మిర్చి రైతుకు వైరస్‌ రూపంలో ఆదిలోనే నష్టాల ఘాటు నషాళానికి అంటింది. మిరప తొలి కాపు చేతికి వచ్చే సమయంలో నివర్‌ తుపాను కారణంగా పడిన వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి.    భారీ వర్షాల వల్ల తొలి కాపును రైతులు పూర్తిగా కోల్పోయారు. చేలల్లో నీరు నిలిచి మిరప ఉరకెత్తింది. పూత రాలి పోయింది. కాయ లు కుళ్ళి పోయాయి. మరో వైపు రెండు రోజుల నుంచి కొనసాగుతున్న తుపాను వాతా వరణం తో మిర్చికి వైరస్‌ మరింతగా పెరిగే ప్రమాదం ఉందని శాస్తవేత్తలు చెబు తున్నారు. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లితే అరకొరగా నష్టం అంచనా వేస్తున్నారని రైతులు వాపోతున్నారు.(ఆంధ్రజ్యోతి - నరసరావుపేట, గుంటూరు, వెల్దుర్తి)

నివర్‌ తుపాను జిల్లాలోని మిరప రైతుల వెన్ను విరిచింది. మిరప పంటకు వర్షాల వల్ల అపార నష్టం వాటి ల్లింది. ఉరకెత్తిన మిరప ఎండిపోతున్నది. ఉరకెత్తి ఎండి పోతున్న మిరపను కాపాడుకునేందుకు వారు అష్టకష్టాలు పడుతున్నా ప్రయోజనం కన్పించడంలేదు. మొక్కలకు ఆ కులు రాలి అవి ఎండిపోతున్నాయి. మొక్కలు వాలిపో యాయి. వీటిని సరి చేసే పనుల్లో రైతులు నిమగ్న మ య్యారు. జిల్లాలో 1,79,545 ఎకరాలలో మిరప పంటను రైతులు సాగు చేశారు. ఇప్పటికే ఎకరాకు రూ.70వేల నుంచి 80 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు.  వైరస్‌, నివర్‌ తుపాన్‌ జిల్లాలో మిర్చి రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. పంట నష్టం అంచనా సక్రమంగా జరగ డంలేదని నరసరావుపేట మండలం జొన్నలగడ్డ రైతులు వాపోతున్నారు. నిబంధనలు సడలించి పంటను కోల్పో యిన రైతులందరికీ పరహారం అందించాలని బాధిత రైతు లు కోరుతున్నారు. సమగ్రంగా పంట నష్టాన్ని గుర్తించా లని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నాయకుడు నల్లపాటి రామారావు డిమాండ్‌ చేశారు. మిరప పంట నష్టం అంచనాపై ఉద్యాన శాఖ ఏడీ బీజే బెన్నీని మంగళవారం వివరణ కోరగా నరసరావుపేట, గురజాల డివిజన్ల పరిధి లోని 25 మండలాల్లో 1516 ఎకరాలలో మిరప పంటకు నష్టం వాటిల్లినట్టు ప్రాఽథమిక అంచనాగా ఉందన్నారు. ఇంకా 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. 33 శాతం పంట దెబ్బ తింటేనే నష్టం అంచనా వేయడం జరు గుతుందన్నారు. ఈ లెక్కలను పరిశీలిస్తే పంట నష్టపోయిన రైతులకు పరిహారం పూర్తి స్ధాయిలో అందే పరిస్థితులు కానరావడంలేదు.


ఊపిరి తీస్తోన్న వైరస్‌..

జిల్లాలోని అన్నిప్రాంతాలలో మిర్చి పంటను వైరస్‌ దెబ్బతీస్తున్నట్లు రైతులు తెలిపారు. వైరస్‌ను తట్టుకునే విత్తనాలన్న ప్రచారంతో రైతులు పెద్దఎత్తున వివిధ కంపెనీల విత్తనాలను కొనుగోలు చేశారు. అయినా వైరస్‌ పంటను దెబ్బతీసింది. జిల్లాలో ప్రస్తుతం జేఎంవీ, సీఎంవీ, టీఎంవీ వైరస్‌లు సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జెమిని వైరస్‌ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని వ్యవసా య, ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గి నెమ్ముశాతం పెరిగితే తెల్లదోమ వస్తుంది. తెల్లదోమ వైరస్‌ను పెంచుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.  జిల్లాలో ఈఏడాది రైతులు సుమారు 2.5 లక్షల ఎకరాల్లో మిర్చిని సాగు చేయగా వైరస్‌తో ఇప్పటికి పదివేల ఎక రాల్లో పంటను తొలగించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 50 వేల ఎకరాలకు వైరస్‌ సోకినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పటి ఎకరానికి సగటున రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చుచేశారు. అయినా వైరస్‌తో దెబ్బతిన్న మొక్కలు కోలుకుని పండే అవకాశంలేదని 3-5 నెలల పైరును రైతులు తొలగిస్తున్నారు. ఎకరం రూ.15 వేల నుంచి రూ.25 వేలు కౌలు చెల్లించి పైరు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం చలి కాలం, వాతావరణంలో నెమ్ముశాతం ఎక్కు వగా ఉంటుందని మొక్క వైరస్‌ను తట్టు కోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, లాం వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు మిరప వైరస్‌పై దృష్టి పెట్టి రైతులకు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.చెరువు ఊటతో.. నష్టం

వర్షం తగ్గిందిలే ఎలాగోలా పం టను కాపాడుకుందామని భా వించిన రైతన్నకు చెరువు నీరు శాపంలా మారింది. వెల్దుర్తి మండ లంలోని హనుమాపురం తండా గ్రామ రైతులు కొందరు వజ్రాలపాడు చెరువు సమీపంలో ఎకరాకు రూ.50 వేలు పెట్టి మిర్చి పంటను సాగు చేశారు. అంతా సవ్యంగా ఉందిలే అని భా విస్తున్న తరుణంలో ఎడతెరిపి లేకుండా నాలుగు రోజుల పాటు వర్షం కురవడంతో చేలల్లో నీరు చేరింది. వర్షం తగ్గిం దిలే ఎలా గోలా పంటను చేజిక్కించుకుందామని భావిస్తుం డగా పక్కనే ఉన్న చెరువు ఊట నీరు పొలాల్లోకి పారు తోంది. దీంతో మొక్కలు చచ్చిపోతున్నాయి. పంటను పీకేసి ప్రత్యా మ్నాయం చేపడుదామన్నా నీరు పొలంలోనే నిలిచి ఉండడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు చిక్కుకున్నారు.


నేటి నుంచి నష్టం అంచనాలు 

జిల్లాలో తుపాను కారణంగా నష్టపో యిన పంటలను బుధవారం నుంచి అధి కారులు అంచనాలు వేయ నున్నారు. ఇప్ప టికే జిల్లాలో 44 మండలాల్లోని 497 గ్రామాల్లో వ్యవసాయ, 30 మండలాల్లోని 175 గ్రామాల్లో ఉద్యాన పంటలు 1,41,037.33 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు.  గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలు సేకరించిన వివరాలను అక్కడే ఉన్న రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేస్తారని అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీలోపు అంచనాల సర్వే పూర్తి అవుతుందన్నారు. నెలాఖరులోపు రైతుల ఖాతా లలో నష్ట పరిహారం జమ చేసే ఏర్పాట్లు జరుగు తున్నట్లు తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. 


నిండి మునిగాం

మూడెకరాల్లో మిర్చి సాగు చేశాను. మొక్కల కొను గోలుకే ఎకరానికి రూ. 30 వేలు ఖర్చయింది. పెట్టుబడి మరో రూ.30 వేలు పెట్టాను. వర్షాలతో నిండిన చెరువు నీటితో పంటను పూర్తిగా నష్టపోయాను. మా పరిస్థితి అగమ్య గోచ రంగా ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి. 

- బాలునాయక్‌, రైతు, హనుమాపురం తండా


నారుకు రూ.80 వేల ఖర్చు

ఐదు ఎకరాలు మిర్చి వేశా. నారు కు రూ.80 వేలు ఖర్చు అయింది.  వైరస్‌ వల్ల ఇప్పటికి రెండెకరాలు పీకేశాను. మళ్లీ ఎకరానికి రూ.20 వేలు వెచ్చించి ఎకరానికి మొక్క లు కొనుగోలు చేశాం. ఇప్పటివరకు రూ.6 లక్షలు ఖర్చయింది. పెట్టుబడి రావాలంటే ఇతర పంటల వల్ల రా దు,అందుకని మరలా మిర్చి వేశాను. 

 -కె. మోషే, కౌలు రైతు, యడ్లపాడు


పీకేసుకోండి.. నమోదు చేస్తాం

వర్షాలు.. వైరస్‌తో మిర్చి రైతు లు భారీగా నష్టపోయారు. జిల్లాలో భారీగా నష్టం వాటిల్లినా అంచనా ల్లో నిబంధనల సాకుతో అధికారులు పరిహారం జాబితాలోకి రైతులను నమో దు చేయడంలేదు. 33 శాతంకు పైగా పంట దెబ్బతింటేనే నష్టం అంచనా జాబి తాలో చోటు దక్కుతుంది. ఒక కాపు పూర్తి గా కోల్పోయినా పరిహారం జాబితాలోకి రా వడంలేదు. ఈ విధానంపై రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. పంట పీకేసు కొండి నష్టం కింద నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారని మిరప రైతులు వాపోతున్నారు.


Updated Date - 2020-12-02T05:16:15+05:30 IST