విజయకీలాద్రికి విచ్చేసిన మంత్రి పేర్ని నాని

ABN , First Publish Date - 2020-12-19T06:13:17+05:30 IST

తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంలో త్రిదండి చినజీయర్‌ ప్రత్యక్ష పర్యవేణలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలలో శుక్రవారం రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పాల్గొన్నారు.

విజయకీలాద్రికి విచ్చేసిన మంత్రి పేర్ని నాని
విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వాన పత్రాన్ని చినజీయర్‌కు అందజేస్తున్న మంత్రి పేర్ని నాని

తాడేపల్లి టౌన్‌, డిసెంబరు 18: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంలో త్రిదండి చినజీయర్‌ ప్రత్యక్ష పర్యవేణలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలలో శుక్రవారం రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పాల్గొన్నారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రికి చిన్నజీయర్‌ మంగళశాసనాలు అందజేశారు. మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ కార్యక్రమానికి చిన్నజీయర్‌ను మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. శుక్రవారం చిన్నజీయర్‌ 3వ పాశురాన్ని భక్తులకు వివరించారు. అనంతరం తీర్థ ప్రసాద గోష్టితో భక్తులకు మంగళశాసనాలు అందించారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, జీయర్‌ ఆశ్రమ ప్రతినిధి వెంకటాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Read more