-
-
Home » Andhra Pradesh » Guntur » Minister Mopidevi Venkataramana
-
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా
ABN , First Publish Date - 2020-06-23T09:37:40+05:30 IST
రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ద్వారా నూతన ప్రాజెక్టుల ఏర్పాటుకు..

హోదా, రైల్వే జోన్ల కోసం పోరాడతాం
మంత్రి మోపిదేవి వెంకటరమణ
గుంటూరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ద్వారా నూతన ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేస్తానని ఇటీవల రాజ్మసభకు ఎంపికైన రాష్ట్ర పశు సంవర్ధక, మత్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. సోమవారం గుంటూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేకర్ల సమావేశంకైన రాష్ట్ర పశు సంవర్ధక, మత్యశాఖ మంత్రి మోపిదేవి వెం నిర్వహించారు. తనతో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసినందకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తూ పనిచేసే నాయకుల గౌరవం పెంచేలా రాజ్యసభ సీట్లు కేటాయించారని తెలిపారు.
హోదా, రైల్వే జోన్ల కోసం పోరడతామన్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల వినతి మేరకు బిల్డ్ ఏపీ నుంచి మినహాయించి మార్కెట్‌ను అభివృద్ధి పరుస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తాఫా, మద్దాలి గిరిధర్, కిలారి రోశయ్య, మార్కెట్ యార్డు ఛైర్మ న్ చంద్రగిరి ఏసురత్నం, నేతలు లేళ్ల అప్పిరెడ్డి, పాదర్తి రమేష్‌గాంధీ, కావటి మనోహర్ నాయుడు, గులాం రసూల్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మోపిదేవికి అభినందనలు
మోపిదేవి వెంకటరమణను సోమవారం స్థానిక ఐబీ అతిథిగృహంలో కలెక్టర్ ఐ.శ్యామ్యూల్ ఆనంద్ కుమార్, అర్బన్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి, రూరల్ ఎస్పీ విశాల్‌గున్ని, నగర కమిషనర్ అనురాధ కలిసి శు భాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాళి గిరిధర్, కిలారి రోశయ్య, మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ పంచాయతీ రాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అసోసియేషన్ నేతలు పుష్ఫగుచ్ఛాలు అందజేసి అభినందించారు. పీవీకే నాయుడు కురగాయల మార్కెట్ వర్తకులు మోపిదేవిని సత్కరించారు.