ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా

ABN , First Publish Date - 2020-12-25T06:08:28+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీలను ప్రహసనంగా మార్చి వెబ్‌ కౌన్సెలింగ్‌ పేరుతో ఎంఈవో కార్యాలయాలకు కౌన్సెలింగ్‌ను దిగజార్చి, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫ్యాప్టో అధ్యక్ష, కార్యదర్శులు కె.బసవలింగారావు, కె.నరసింహారావు డిమాండ్‌చేశారు.

ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా

గుంటూరు (విద్య), డిసెంబరు 24: ఉపాధ్యాయుల బదిలీలను ప్రహసనంగా మార్చి వెబ్‌ కౌన్సెలింగ్‌ పేరుతో ఎంఈవో కార్యాలయాలకు కౌన్సెలింగ్‌ను దిగజార్చి, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫ్యాప్టో అధ్యక్ష, కార్యదర్శులు కె.బసవలింగారావు, కె.నరసింహారావు డిమాండ్‌చేశారు.  గురవారం మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఈవో కార్యాలయాల్లో బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించడం శోచనీయమన్నారు. వెబ్‌ కౌన్సిలింగ్‌ను రద్దుచేసి సాధారణ పద్ధతిలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో సంఘం నాయకులు రమేష్‌, ప్రసాద్‌, నాగార్జునరావు, యోగానంద్‌, కోటేశ్వరరావు, వందనం, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-25T06:08:28+05:30 IST