రెడ్‌క్రాస్ కరోనా వారియర్లకు సత్కారం
ABN , First Publish Date - 2020-12-17T06:11:41+05:30 IST
కొవిడ్-19 ధాటికి పలువురు వైద్యసిబ్బంది బలౌతున్నా ఏమాత్రం భయపడకుండా ప్రభుత్వాస్పత్రిలో రెడ్‌క్రాస్ వలంటీర్లు ధైర్యంగా తమ వంతు సేవలు అందించడం అభినందనీయమని గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి కొనియాడారు.

గుంటూరు (మెడికల్), డిసెంబరు 16: కొవిడ్-19 ధాటికి పలువురు వైద్యసిబ్బంది బలౌతున్నా ఏమాత్రం భయపడకుండా ప్రభుత్వాస్పత్రిలో రెడ్‌క్రాస్ వలంటీర్లు ధైర్యంగా తమ వంతు సేవలు అందించడం అభినందనీయమని గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి కొనియాడారు. బుధవారం జీజీహెచ్‌లోని నాట్కో ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రిలో కరోనా రోగులకు సేవలు అందించిన 30మంది రెడ్‌క్రాస్ వలంటీర్లకు ఆమె ప్రశంసాపత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ రామచంద్రరాజును కూడా సత్కరించారు. కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్‌ఎంవో సతీష్‌కుమార్, ఆర్ధోపెడిక్ ప్రొఫెసర్ రమణ యశస్వీ, ఆబ్జుడా అధ్యక్షుడు డాక్టర్ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.