ప్రైవేటు వైద్యశాలల బంద్‌ సంపూర్ణం

ABN , First Publish Date - 2020-12-12T05:16:50+05:30 IST

ఆయుర్వేద డాక్టర్లు అల్లోపతి వైద్యంలో ఆపరేషన్లు చే సుకోవచ్చనే సెంటర్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సీసీఐఎం) ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రైవేటు వైద్యులు బంద్‌ పాటించారు.

ప్రైవేటు వైద్యశాలల బంద్‌ సంపూర్ణం

గుంటూరు (మెడికల్‌) డిసెంబర్‌ 10: ఆయుర్వేద డాక్టర్లు అల్లోపతి వైద్యంలో ఆపరేషన్లు చే సుకోవచ్చనే సెంటర్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సీసీఐఎం) ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రైవేటు వైద్యులు బంద్‌ పాటించారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, క్లినిక్‌లు మూతపడ్డాయి. ఐఏంఏ, దంత వైద్యుల సంఘం నగర శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌లో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు ఓపీ సేవలను నిలిపివేశారు. కేవలం అత్యవసర కేసులకు మాత్రమే చికిత్సలు అందించారు. హాస్పిటల్స్‌ ముందు తమ నిరసన తెలియజేసే బ్యానర్లను ఏర్పాటు చేశారు.  బంద్‌ కారణంగా రోగులు ఇబ్బందులకు గురయ్యారు.  కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఈ నిర్ణయం ఉప సంహరించుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో తమ ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని ఐఎంఏ డాక్టర్లు హెచ్చరించారు. 

Updated Date - 2020-12-12T05:16:50+05:30 IST