నేడు జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల బంద్‌

ABN , First Publish Date - 2020-12-11T05:53:44+05:30 IST

సెంటర్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌(సీసీఐఎం) ఆదేశాలు ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఐఎంఏ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల బంద్‌ చేస్తున్నట్లు ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్‌ జీ నందకిషోర్‌ తెలిపారు.

నేడు జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల బంద్‌

గుంటూరు(మెడికల్‌), డిసెంబరు 10: సెంటర్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌(సీసీఐఎం) ఆదేశాలు ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఐఎంఏ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల బంద్‌ చేస్తున్నట్లు ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్‌ జీ నందకిషోర్‌ తెలిపారు. ఆయుర్వేద డాక్టర్లు అల్లోపతి వైద్యంలో ఆపరేషన్లు చే సుకోవచ్చనే సీసీఐఎం ఆదేశాలు ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అల్లోపతి, డెంటల్‌ డాక్టర్లు బంద్‌లో పాల్గొనాలన్నారు. బంద్‌లో భాగంగా జిల్లాలో శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు ఓపీ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కేవలం అత్యవసర కేసులకు, కరోనా పాజిటివ్‌ కేసులకు మాత్రమే వైద్యం అందిస్తాయని చెప్పారు. బంద్‌ జయప్రదం చేయాలని మరో ప్రకటనలో ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ (ఐడీఏ) గుంటూరు శాఖ కార్యదర్శి డాక్టర్‌ కే రాజ్‌కుమార్‌ కోరారు.  

Updated Date - 2020-12-11T05:53:44+05:30 IST