అధికారులపై ఎమ్మెల్యే రామకృష్ణ ఫైర్

ABN , First Publish Date - 2020-10-13T18:48:50+05:30 IST

జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అధికారులపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ఫైర్ అయ్యారు.

అధికారులపై ఎమ్మెల్యే రామకృష్ణ ఫైర్

గుంటూరు: జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అధికారులపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ఫైర్ అయ్యారు. సమావేశానికి ఎక్కవ మంది అధికారులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 223 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయని... అధికారుల నిర్లక్ష్యం వల్లే కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా పని చేయాలని ఆదేశించారు. 2020లో కూడా బలవంతుడు బలహీణుడిని అణగతొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమైన సమావేశానికి హాజరవడంలో అధికారులు ఇంత నిర్లక్ష్యమా అని మండిపడుతూ జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్‌లో ఉండడం బాధాకరమన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు వెనుకాడకూడదని ఎమ్యెల్యే రామకృష్ణ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-10-13T18:48:50+05:30 IST