బతుకు.. భారమై.. పనులు లేక కార్పెంటర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-21T13:26:25+05:30 IST

కరోనా వచ్చి కొందరు.. ఆ భయంతో మరికొందరు మృతి చెందుతోండగా.. మరికొందరు ఉపాధి లేక బతుకు భారమై ప్రాణాలు తీసుకుంటున్నారు. పనులు లేక ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఏటీఅగ్రహారంలోని మహబూబ్‌నగర్‌ రెండో లైనుకు

బతుకు.. భారమై.. పనులు లేక కార్పెంటర్‌ ఆత్మహత్య


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా వచ్చి కొందరు.. ఆ భయంతో మరికొందరు మృతి చెందుతోండగా.. మరికొందరు ఉపాధి లేక బతుకు భారమై ప్రాణాలు తీసుకుంటున్నారు. పనులు లేక ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఏటీఅగ్రహారంలోని మహబూబ్‌నగర్‌ రెండో లైనుకు చెందిన షేక్‌ రబ్బాని(34) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కార్పెంటర్‌గా పని చేసుకుని జీవనం సాగించే ఇతడికి కరోనాతో పనులు లేకుండా పోయాయి. రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసికంగా ఇబ్బంది పడుతుడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఒకసారి ఆత్మహత్య చేసుకుంటానని కత్తితో చేయి కోసుకోగా భార్య సర్థి చెప్పింది. ఇంతలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.  


పనిలేదు.. ఇంటికి వచ్చానని ఫోన్‌

రబ్బానికి జహెరబీతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. రబ్బాని భార్య పట్టాభిపురంలోని షాదీఖానాలో పని చేస్తుంటుంది. రోజు మాదిరిగానే ఆదివారం రహెజా తన ఇద్దరు కుమార్తె లను  అమ్మమ్మగారింటిలో వదిలి పనికి వెళ్లింది.  మధ్యాహ్నం భర్త ఫోన్‌ చేసి పని లేక పోవడంతో ఇంటికి వచ్చేసినట్లు రహెజాకు చె ప్పాడు. సాయంత్రం ఆమె ఇంటికి వచ్చితలుపుకొట్టగా తీయలేదు. దీంతో భర్త సోదరుడు మహ్మద్‌రఫీకి ఫోన్‌ చేయగా అతడు వచ్చి చూసే సరికి రబ్బాని  ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతూ ఉన్నాడు. కిందికి దించి 108కు ఫోన్‌ చేయగా వారు వచ్చి పరీక్షించి రబ్బానీ మృతి చెందినట్లు చెప్పారు. రహెజా ఫిర్యాదు మేరకు నగరంపాలెం ఎస్‌ఐ సలాం కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-09-21T13:26:25+05:30 IST