దళితులపై పెరుగుతున్న దాడులు
ABN , First Publish Date - 2020-12-02T05:12:25+05:30 IST
దళితులపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్ ఆరోపించారు.
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్‌కుమార్
తాడేపల్లి టౌన్, డిసెంబరు 1: దళితులపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలలో దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు. శిరోముండనాలు పెరిగిపోయాయన్నారు. దళితులపై జరుగుతున్న దాడులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, ఎస్సీ కార్పొరేషన్ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి మళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దళిత పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జం రామకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు విప్పర్ల విజయభాస్కర్, మహిళా అధ్యక్షురాలు పల్లి మేరి, నేతలు మేరుగ నాగేశ్వరరావు, బోరుగడ్డ బుల్లిబాబు, కంతేటి ప్రజ్ఞయ్య, ప్రేమప్రసాద్, గొర్రెముచ్చు ఫ్రాన్సిస్, బెజ్జం కుమార్ తదితరులు పాల్గొన్నారు.