మద్దాలికి దమ్ముంటే రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2020-06-21T09:35:07+05:30 IST

టీడీపీ గుర్తుతో గెలిచి చంద్రబాబునే విమర్శిస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరికి దమ్ముంటే వెంటనే తన

మద్దాలికి దమ్ముంటే రాజీనామా చేయాలి

గుంటూరులో టీడీపీ నేతల నిరసన


గుంటూరు, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ గుర్తుతో గెలిచి చంద్రబాబునే విమర్శిస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరికి దమ్ముంటే వెంటనే తన పదవికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు సవాలు విసిరారు. ఆ పార్టీ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర నేతృత్వంలో నేతలు గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు.


అనంతరం నేతలు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ప్రజలు తిరస్కరించిన పశ్చిమలో అవకాశం కల్పించి, శాసనసభకు పంపితే ప్రలోభాలకు లొంగిపోయి రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని, చంద్రబాబును గిరి విమర్శించడం సిగ్గు చేటని అన్నారు. కార్యక్రమంలో నేతలు మానుకొండ శివప్రసాద్‌, పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాసరావు, ఎల్లావుల అశోక్‌, కొత్తూరి వెంకట్‌, మహ్మద్‌ రఫీ, యరమాల విజయ్‌ కిరణ్‌, పేరయ్య యాదవ్‌, ఖాదర్‌ బాషా, చింతకాయల రామారావు, గోళ్ల ప్రభాకర్‌, మానం శ్రీనివాస్‌, మునగా గణపతి, రుస్తుంబాబు, గుడిపల్లి నవీన్‌ కృష్ణ, కర్నాటి సైదారావు, అజార్‌, పోపూరి నరేంద్ర, గార్డెన్స్‌ శ్రీకాంత్‌, కొమ్మినేని కోటేశ్వరరావు, మదమంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-21T09:35:07+05:30 IST