మాదక ద్రవ్యాలతో జీవితం నాశనం

ABN , First Publish Date - 2020-12-19T06:01:12+05:30 IST

మాదక ద్రవ్యాలతో జీవితం నాశనమవుతుందని నగరంపాలెం సీఐ మల్లిఖార్జునరావు అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా నగరంలోని ఏటీ అగ్రహారంలో గల ఎస్‌కేబీఎం స్కూల్‌లో మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

మాదక ద్రవ్యాలతో జీవితం నాశనం

గుంటూరు, డిసెంబరు 18: మాదక ద్రవ్యాలతో జీవితం నాశనమవుతుందని నగరంపాలెం సీఐ మల్లిఖార్జునరావు అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా నగరంలోని ఏటీ అగ్రహారంలో గల ఎస్‌కేబీఎం స్కూల్‌లో మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మాదక ద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో స్కూల్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Read more