సత్రశాల సిమెంట్ పరిశ్రమ నీటి వాడకానికి అనుమతి
ABN , First Publish Date - 2020-12-11T05:56:29+05:30 IST
రెంటచింతల మండలం సత్రశాల పరాశక్తి సిమెంట్ కర్మాగారానికి ఐదేళ్లపాటు సమీపంలోని కృష్ణానది నుంచి నీటిని వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
మాచర్ల, డిసెంబరు 10: రెంటచింతల మండలం సత్రశాల పరాశక్తి సిమెంట్ కర్మాగారానికి ఐదేళ్లపాటు సమీపంలోని కృష్ణానది నుంచి నీటిని వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రెండేళ్ల క్రితం తీసుకున్న అనుమతులు ఈ యేడాది మే నాటికి పూర్తయింది. తిరిగి నీటి అనుమతి కోరుతూ నీటి వనరుల శాఖకు పరాశక్తి కర్మాగారం దరఖాస్తు చేసుకుంది. దీంతో చీఫ్ ఇంజనీరు(ఇరిగేషన్) నుంచి నీటి వినియోగానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రోజుకు 1865 కిలో లీటర్ల (0.762 క్యూసెక్కులు) వాడకానికి అనుమతి లభించింది. 1000 గ్యాలన్ల నీటికి రూ.5.50 ధరను చెల్లించేలా ఉత్తర్వులు ఇచ్చారు.