హత్యా రాజకీయాలు సహించేది లేదు: నారా లోకేష్‌

ABN , First Publish Date - 2020-12-30T05:35:29+05:30 IST

వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.

హత్యా రాజకీయాలు సహించేది లేదు: నారా లోకేష్‌
శావల్యాపురంలో ప్రజలకు అభివాదం చేస్తున్న నారా లోకేష్‌

శావల్యాపురం, డిసెంబరు 29: వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శావల్యాపురంలో మంగళవారం టీడీపీ కార్యకర్తలు చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకొని వెలగపూడి వెళుతున్న నారా లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయన్నారు. అఽధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ  కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ సహించేది లేదని, రానున్న రోజుల్లో వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గుంటూరు సాంబశివరావు, గడిపూడి విశ్వనాథం, గోరంట్ల హనుమంతరావు, గద్దె మస్తాన్‌రావు, దొడ్డా ఏడుకొండలు, నలమాటి వెంకటేష్‌, చెరుకూరి కోటినారాయణ, చౌదరి, పాలడుగు ఏడుకొండలు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T05:35:29+05:30 IST