వర్చ్యువల్ విధానంలో రేపు లోక్‌అదాలత్
ABN , First Publish Date - 2020-12-11T06:19:48+05:30 IST
వర్చ్యువల్ విధానంలో శనివారం జరిగే లోక్‌అదాలత్‌లో కోర్టుల్లో పెండింగ్ ఉన్న వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ గుమ్మడి గోపిచంద్ తెలిపారు.
గుంటూరు(లీగల్): వర్చ్యువల్ విధానంలో శనివారం జరిగే లోక్‌అదాలత్‌లో కోర్టుల్లో పెండింగ్ ఉన్న వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ గుమ్మడి గోపిచంద్ తెలిపారు. వర్చ్యువల్ విధానంలో జరిగే లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థతో పాటు అన్ని మండల న్యాయసేవా కేంద్రాల్లోనూ లోక్ అదాలత్ బెంచ్‌ల్లో ఆయా కేసులను పరిష్కారానికి ఉంచుతామని చెప్పారు. కోర్టుకు రాకుండానే వాట్సాప్, బ్లూజోన్స్, వీడియోకాల్ ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. రాజీ పడదలచిన వారు తమ కేసు వివరాలను ముందుగా 9440901048 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా, 7330848575, 9010790783 నెంబర్లకు వాట్సాప్ ద్వారా గానీ తెలియజేయాలని కోరారు.