-
-
Home » Andhra Pradesh » Guntur » lok adalath
-
12న జాతీయ లోక్‌అదాలత్
ABN , First Publish Date - 2020-11-22T04:47:30+05:30 IST
పోలీస్‌స్టేషన్‌ల వారీగా రాజీపడదగిన క్రిమినల్ కేసులను గుర్తించి వాటి జాబితాను తయారు చేయాలని న్యాయమూర్తులు పోలీస్ అధికారులకు సూచించారు.

గుంటూరు (లీగల్), నవంబరు 21: పోలీస్‌స్టేషన్‌ల వారీగా రాజీపడదగిన క్రిమినల్ కేసులను గుర్తించి వాటి జాబితాను తయారు చేయాలని న్యాయమూర్తులు పోలీస్ అధికారులకు సూచించారు. డిసెంబర్ 12న జరుగనున్న జాతీయ లోక్‌అదాలత్‌పై శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంస్థ కార్యదర్శి కె.రత్నకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నాలుగో అదనపు జిల్లా జడ్జి జి.రాంగోపాల్ అధ్యక్షత వహించారు. పలువురు మేజిస్ర్టేట్‌లు, అర్బన్ పరిధిలో పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.