స్వల్పంగా ఊరట

ABN , First Publish Date - 2020-05-19T08:40:42+05:30 IST

లాక్‌డౌన్‌ 4.0లో గుంటూరు న గరం, నరసరావుపేట పట్టణంలో ఎలాంటి ఆంక్షల సడలింపు లేదు.

స్వల్పంగా ఊరట

గుంటూరు సిటీ, నరసరావుపేటలో లాక్‌డౌన్‌ యథాతథం

కరోనా వ్యాప్తి నిలిచిపోయిన 14 క్లస్టర్లలో కంటైన్‌మెంట్‌ ఆపరేషన్‌ ముగింపు 

కేసులు లేని చోట్ల ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు షాపులకు అనుమతి

ఆస్పత్రుల్లో అత్యవసర కేసులు మాత్రమే చూడాలి ..

లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కలెక్టర్‌ 


గుంటూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ 4.0లో గుంటూరు న గరం, నరసరావుపేట పట్టణంలో ఎలాంటి ఆంక్షల సడలింపు లేదు. గత కొన్ని రోజులుగా అ మలు జరుగుతున్న మా ర్గదర్శకాలు యథా తథంగా కొనసాగుతా యని జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన జిల్లాకు సంబంధించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 24 వేల మందికి కరోన పరీక్షలు చేయగా 417 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధా రణ అయిందన్నారు. వారిలోనూ 300 మందికి పైగా కోలుకొని డిశ్చార్జ్‌ అయిపోయారని తెలిపారు.


కర్నూలు జిల్లాకు చెందిన 45వేల మంది వలస కూలీలను గత కొన్ని రోజుల్లో బస్సుల ద్వారా తరలించాం. మరో 14 వేలమందిని కూడా ఇతర జిల్లాలకు బస్సుల్లో పంపించామన్నారు. ఒడి స్సా, ఛత్తీస్‌ఘడ్‌, బీహార్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రా లకు వలస కూలీలను శ్రా మిక్‌ రైళ్లలో పంపి స్తోన్నామన్నారు. అర్బన్‌ ఎస్‌పీ పీహెచ్‌డీ రామ కృష్ణ మాట్లాడుతూ గుం టూరు నగరంలోని ప్రజ లు లాక్‌డౌన్‌ 4.0 అమ లుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


కరోనా కేసులు నిలిచిపోవడం వలన కొన్ని క్లస్టర్లలో కంటె ౖన్‌మెంట్‌ ఆపరేషన్స్‌ని నిలిపేస్తున్నామన్నారు. శ్రీని వాసరావుపేటలో వచ్చే వారంవరకు ఎలాంటి కేసు నమోదు కాకపోతే దానిని కూడా కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ నుంచి తొలగిస్తామని చెప్పారు. బఫర్‌ జోన్లలో అవ సరమైతే ప్రజలు ఉదయం 6 నుంచి 9 గంటల మఽ ద్యన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి బయటకు రావాలన్నారు. కంటైన్‌మెంట్‌లో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. 


ఆంక్షలు.. సడలింపులు...

  •  జిల్లాలో ఎక్కడైతే కరోనా చివరి కేసు నమోదై  28   రోజులు గడిచిందో అక్కడ కంటైన్‌మెంట్‌ ఆపరేషన్స్‌ని నిలిపేస్తారు. 

  •   గ్రీన్‌ జోన్లలో ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు సాధారణ దుకాణాలకు అనుమతి 

  •  బఫర్‌ జోన్లలో గతంలో వలే ఉదయం 6 నుంచి  9  గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల దుకాణాలు తెరుచుకొనేందుకు అనుమతి

  •  బఫర్‌ జోన్లలో ఎట్టి పరిస్థితుల్లో సెలూన్‌ షాపులకు అనుమతి లేదు.

  •  జిల్లాలో ఎక్కడా హోటల్స్‌, రెస్టారెంట్‌లు తెరవడానికి అనుమతి లేదు. 

  • చర్చిలు, దేవాలయాలు, మసీదులు తెరవరాదు.

  •  గ్రీన్‌ జోన్లలో మాత్రమే 50 మందితో వివాహాలకు  అనుమతి. అంతిమయాత్రకు మాత్రం 20 మందికే అనుమతి ఇస్తారు.

  •  అన్ని మార్కెట్‌ల వద్ద సామాజిక దూరం పాటించాలి. 

  • మాస్కులు ధరించకపోయినా, బహిరంగ ప్రదేశాల్లో  ఉమ్మి వేసినా భారీగా పెనాల్టీ

  • బఫర్‌ జోన్లలోని హాస్పిటల్స్‌లో కేవలం అత్యవసర కేసులు మాత్రమే చూడాలి. కాన్పులు, కీమోథెరపీ, డయాలసిస్‌, గుండెజబ్బులకు మాత్రమే చికిత్స అందించాలి.

  • అది కూడా వారికి కరోనా పరీక్షలు చేయించి, కొవిడ్‌ లేదని నిర్ధారించుకొన్న తర్వాత   వైద్యం చేయాలి.

Updated Date - 2020-05-19T08:40:42+05:30 IST