వాహనాలకూ లాక్‌

ABN , First Publish Date - 2020-04-25T10:04:37+05:30 IST

అర్బన్‌ జిల్లా పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 142 మందిపై శుక్రవారం పోలీసులు కేసులు నమోదు చేశారు.

వాహనాలకూ లాక్‌

గుంటూరు :

 అర్బన్‌ జిల్లా పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 142 మందిపై శుక్రవారం పోలీసులు కేసులు నమోదు చేశారు.  ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారిని, దుకాణాలు తెరిచిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 142 మందిని పట్టుకుని 31 కేసులు నమోదు చేసి 87 వాహనాలు సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు.


గత నెల 24 నుంచి ఇప్పటివరకు అర్బన్‌లో 5,929 మందిపై 234 కేసులు నమోదు చేసి 4,001 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. అలాగే 352 దుకాణాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 152 వాహనాలపై మోటారు వాహన చట్టం ప్రకారం కేసు నమోదుచేసి 83,645 జరిమానా విధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2020-04-25T10:04:37+05:30 IST