12న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2020-12-02T05:17:59+05:30 IST

ఈ నెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నకుమార్‌ తెలిపారు.

12న జాతీయ లోక్‌ అదాలత్‌

 గుంటూరు లీగల్‌, డిసెంబరు 1: ఈ నెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నకుమార్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుమ్మడి గోపిచంద్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణల్లో లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తామన్నారు. సుమారు 2000 పైగా రాజీపడదగిన క్రిమినల్‌ కేసులను  గుర్తించినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-02T05:17:59+05:30 IST