ఖరీఫ్‌ పంట రుణాలు ఖరారు

ABN , First Publish Date - 2020-04-05T09:14:36+05:30 IST

జిల్లాలో 2020-21 ఖరీఫ్‌, రబీ పంటలకు బ్యాంక్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పెట్టుబడి రుణాలు ప్రభుత్వం ఖరారు చేసింది.

ఖరీఫ్‌ పంట రుణాలు ఖరారు

మిర్చికి రూ.88వేలు, పసుపుకు రూ.80వేలు 

ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు


గుంటూరు, ఏప్రియల్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2020-21 ఖరీఫ్‌, రబీ పంటలకు బ్యాంక్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు   పెట్టుబడి రుణాలు ప్రభుత్వం ఖరారు చేసింది.  వరి - రూ.33వేలు, వేరు శనగ రూ.25వేలు, మొక్కజొన్న రూ.32వేలు, కంది రూ.18వేలు, శనగ (బెంగాల్‌ గ్రామ్‌) రూ.22వేలు, పెసర, మినుము రూ.15వేలు, అరటి (టిష్సు కల్చర్‌) రూ.90వేలు, అరటి (మొక్క) 60వేలు, అరటి (పిలకలు) రూ.42వేలు, మిర్చి రూ.88వేలు, పత్తి రూ.38వేలు, పసుపు రూ.80వేలు, తమలపాకు రూ.70వేలు, ఉల్లి రూ.35వేలు, చెరకు (మొక్క) రూ.60వేలు, చెరకు (పిలకలు) రూ.45వేలు, పూల తోటలు, కూరగాయలకు రూ.35వేలుగా ప్రభుత్వం ఖరారు చేసినట్లు ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు తెలిపారు. పంట రుణాలు తీసుకోని రైతులు ఈ ఏడాది బ్యాంక్‌లు, సహకార సంఘాల్లో రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. గతంలో పంట రుణాలు తీసుకున్న వారు రెన్యువల్‌ చేయించుకోవాలన్నారు. దీని వలన రూ.లక్ష లోపు వడ్డీ లేని రుణం, రూ.3 లక్షల లోపు పావలా వడ్డీ అమలు అవుతుందని వివరించారు.

Updated Date - 2020-04-05T09:14:36+05:30 IST