నూతన విద్యా విధానంతో మేలు

ABN , First Publish Date - 2020-12-07T04:56:00+05:30 IST

విద్యారంగంలో వస్తున్న మార్పులు, నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్ధతులను మార్చుకోవాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌ పి.ప్రతాప్‌రెడ్డి అన్నారు.

నూతన విద్యా విధానంతో మేలు

ఏసీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి


క్రోసూరు, డిసెంబరు 6: విద్యారంగంలో వస్తున్న మార్పులు, నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్ధతులను మార్చుకోవాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌ పి.ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం క్రోసూరు జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన నూతన విద్యావిధానం-2020 సెమినార్‌కు ఆయన హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని బోధన అందించాలన్నారు. కాకినాడ రీజనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.నరసింహారావు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనేందుకు నూతన విద్యావిధానం ఎంతో ఉపకరిస్తుందన్నారు. చిలుకా సురేష్‌, టి.కల్పలత, హెచ్‌ఎం రాఘవేంద్రరరావు, అప్పారావు, ప్రభాకరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read more