కొండపాటూరు తిరునాళ్ల నిలుపుదల

ABN , First Publish Date - 2020-03-24T09:56:13+05:30 IST

కాకుమాను మండలంలోని కొండపాటూరులో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర, శిడిమానోత్సవం నిలుపుదల చేస్తున్నట్లు కలెక్టర్‌ ...

కొండపాటూరు తిరునాళ్ల నిలుపుదల

 గుంటూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : కాకుమాను మండలంలోని కొండపాటూరులో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర, శిడిమానోత్సవం నిలుపుదల చేస్తున్నట్లు కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏటా మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు అమ్మవారి జాతరని దేవస్థాన కమిటీ నిర్వహిస్తుంది. కరోనా మహమ్మా రిని దృష్టిలో ఉంచుకుని  బాపట్ల డీఎస్పీ, కాకుమాను తహసీల్దార్‌ ఈ ఉత్తర్వులను తూచ తప్పకుండా అమలు చేయాలని  కలెక్టర్‌ ఆదేశిం చారు. పోలేరమ్మ దేవస్థానానికి కేవలం స్థానిక గ్రామ ప్రజలను సా మాజిక దూరం పాటిస్తూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

Read more