ఆంక్షల సుడిలో ‘అమ్మఒడి’ : కొమ్మాలపాటి

ABN , First Publish Date - 2020-12-25T06:14:03+05:30 IST

అమ్మఒడి పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను వైసీపీ ప్రభుత్వం ఆంక్షల సుడిలోకి నెడుతోందని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ పేర్కొన్నారు

ఆంక్షల సుడిలో ‘అమ్మఒడి’ :  కొమ్మాలపాటి

 అమరావతి, డిసెంబరు 24: అమ్మఒడి పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను వైసీపీ ప్రభుత్వం ఆంక్షల సుడిలోకి నెడుతోందని మాజీ  ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ పేర్కొన్నారు. గురువారం లేమల్లె, కర్లపూడి గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  విలేకరులతో మాట్లాడతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ప్రతి పిల్లవాడికి రూ.15వేలు ఇస్తానని, అధికారంలోకి వచ్చాక తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామని మాటమార్చారని, పథకాన్ని అమలు చేయడం చేతగాక రేషన్‌ కార్డులు తొలగించి తల్లులను మోసం చేస్తున్నారని విమర్శించారు.    అన్ని పథకాలలో కోతలు విధిస్తూ కోతల ప్రభుత్వంగా పాలన కొనసాగుతోందని కొమ్మాలపాటి విమర్శించారు. 


Updated Date - 2020-12-25T06:14:03+05:30 IST