అవినీతిపై ప్రశ్నిస్తే అంతం చేస్తారా?

ABN , First Publish Date - 2020-12-31T05:25:14+05:30 IST

ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు అధికార పార్టీ నేతలు హత్య చేస్తారా? అని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ప్రశ్నించారు.

అవినీతిపై ప్రశ్నిస్తే అంతం చేస్తారా?
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌

రాష్ట్రంలో మంట గలిసిన ప్రజాస్వామ్యం 


పెదకూరపాడు, డిసెంబరు 30: ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు అధికార పార్టీ నేతలు హత్య చేస్తారా? అని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ప్రశ్నించారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికార ప్రతినిధి, చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య హత్య ఘటన రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను మంట గలిపిందన్నారు. సీఎం సొంత జిల్లా అయిన కడపలోనే సుబ్బయ్యను హత్య చేయటం దుర్మార్గమన్నారు. సుబ్బయ్య కుటుంబాన్ని కుటుంబాన్ని సీఎం పరామర్శించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బత్తుల శ్రీనివాసరావు, శివరాత్రి శ్రీనివాసరావు, నలజాల సదాశివరావు, చిలకా పెదబాబు, నందిగం ఆశీర్వాదం, మేదరమెట్ల శోమశేఖర్‌, ముద్దన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:25:14+05:30 IST