విజయకీలాద్రిపై అధ్యయనోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-15T05:30:00+05:30 IST

తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రిపై ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా మంగళవారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి.

విజయకీలాద్రిపై అధ్యయనోత్సవాలు
స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అలంకారం చేస్తున్న అర్చకులు

తాడేపల్లి టౌన్‌, డిసెంబరు 15: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రిపై ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా మంగళవారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీత్రిదిండి చినజీయర్‌ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం పగల్పట్టు ఉత్సవం వైభవంగా జరిగింది. వైకుంఠ ఏకాదశికి ముందు పది రోజులు, తరువాత పది రోజులు ఈ అధ్యయనోత్సవాలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. జీయర్‌ ఆశ్రమ నిర్వాహకులు వెంకటాచార్యులు ఆధ్వర్యంలో గోదా అష్టోత్తర శతనామార్చన, సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణ కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. భక్తులు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ గోష్టి నిర్వహించారు.

Read more