అప్రమత్తతే కరోనాకు మందు
ABN , First Publish Date - 2020-12-17T06:01:52+05:30 IST
మాస్కుధరించటం, భౌతికదూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండటమే కరోనాకు సరైన మందు అని వాణిజ్య పన్నులశాఖ గుంటూరు-1 జాయింట్ కమిషనర్ ఓంకార్‌రెడ్డి పేర్కొన్నారు.

సీటీ శాఖ జేసీ ఓంకార్‌రెడ్డి
గుంటూరు, డిసెంబరు 16: మాస్కుధరించటం, భౌతికదూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండటమే కరోనాకు సరైన మందు అని వాణిజ్య పన్నులశాఖ గుంటూరు-1 జాయింట్ కమిషనర్ ఓంకార్‌రెడ్డి పేర్కొన్నారు. వాణిజ్య పన్నులశాఖ ఆధ్వర్యంలో కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించటంలో భాగంగా నగరంలో బుధవారం ప్రదర్శన నిర్వహించారు. జిన్నాటవర్ సెంటర్ సీటీ శాఖ భవనం నుంచి మొదలైన ప్రదర్శన రాధాకృష్ణ ధియేటర్ సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ మీదుగా నాజ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు కరోనా పట్ల అస్సలు నిర్లక్ష్యం చేయవద్దన్నారు. నరసరావుపేట డివిజన్ జేసీ కిరణ్‌చౌదరి మాట్లాడుతూ ప్రజలు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవటంతో పాటు మాస్కులు ధరిస్తూ నిబంధనలు పాటిస్తే కరోనాను దూరంచేయటం పెద్ద సమస్య కాదన్నారు. కార్యక్రమంలో డీసీలు, ఏసీలు, అసోసియేషన్ నాయకులు జె.గోపినాధ్, కిషోర్‌కుమార్, శ్రీనివాసరావు, ప్రసాద్, సయ్యద్ జానీబాషా, ఉద్యోగులు పాల్గొన్నారు.