రెండు రోజుల్లో 400 కేసులు
ABN , First Publish Date - 2020-11-16T05:27:15+05:30 IST
కరోనా కేసుల సంఖ్య జిల్లాలో తగ్గుతూ వస్తున్నది.

గుంటూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసుల సంఖ్య జిల్లాలో తగ్గుతూ వస్తున్నది. గతంలో రోజుకు వెయ్యి కేసుల వరకు నమోదు కాగా క్రమంగా తగ్గుతూ నేడు 200లకు అటు, ఇటుగా నమోదు అవుతున్నాయి. శనివారం 194 కేసులు నమోదైతే ఆదివారం అవి 206కు చేరాయి. దీంతో రెండు రోజుల్లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 400లుగా ఉన్నది. పాజిటివ్ రేటు కూడా ప్రస్తుతం 3.50 నుంచి నాలుగు మధ్యనే ఉంటున్నది. ఆదివారం 5,018 శాంపిల్స్ ఫలితాలు రాగా వాటిల్లో 206(4.11 శాతం) మందికి పాజిటివ్, 4,812(95.89 శాతం) మందికి నెగిటివ్ వచ్చింది. ఆదివారం సేకరించిన 1,784 శాంపిల్స్‌తో మొత్తం 8,01,301కి టెస్టుల సంఖ్య చేరింది. వీటిల్లో 8,01,132(99.98 శాతం) ఫలితాలు వచ్చేశాయి. ఇక కేవలం 169(0.02 శాతం) ఫలితాలు మాత్రమే ల్యాబ్‌ల నుంచి వెలువడాల్సి ఉన్నది. కొత్తగా గుంటూరు నగరంలో 60, తాడేపల్లిలో 15, రేపల్లెలో 13, తెనాలిలో 12 మందికి వైరస్ సోకింది. మిగిలిన మండలాల్లో 106 కేసులు వచ్చినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ జే యాస్మిన్ తెలిపారు.