నేటి నుంచి వీరారాధన ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-12-13T05:37:40+05:30 IST

పల్నాడులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వీరారాధన ఉత్సవాలు ఆదివారం నుంచి ఐదు రోజులపాటు జరగనున్నాయి.

నేటి నుంచి వీరారాధన ఉత్సవాలు
వీర్ల దేవాలయంలో ఆయుధాలకు పూజలు నిర్వహిస్తున్న పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ

కారంపూడి, డిసెంబరు 12: పల్నాడులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వీరారాధన ఉత్సవాలు ఆదివారం నుంచి ఐదు రోజులపాటు జరగనున్నాయి.  13న రాచగావు, 14న రాయబారం, 15న మందపోరు, 16న కోడిపోరు, 17న కల్లిపాడు నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వీరాచారవంతులు వారి పూర్వీకుల ఆయుధాలతో తరలివస్తున్నట్లు పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు తెలిపారు. శనివారం వీర్ల దేవాలయంలోని ఆయుధాలను శుభ్రం చేయించి, నూతన వస్త్రాలు అలంకరించి పూజలు జరిపారు. ఆదివారం సాయంత్రం వీర్ల దేవాలయం ముఖద్వారంపై ఎర్రజెండా ఎగురవేసి ఈ ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు. కరోనా నిబంధనల మేరకు వీరాచారవంతులు తమ ఆయుధాలకు పూజలు నిర్వహించి, ఊరేగింపులు జరుపుకొని మొక్కుబడులు తీర్చుకునేందుకు అధికారులు అనుమతించారన్నారు.  సుమారు 900 ఏళ్ల క్రితం పల్నాటి చరిత్రకు అంకురార్పణం జరిగింది. 

Updated Date - 2020-12-13T05:37:40+05:30 IST