కొండవీటి, పాలవాగు పనుల్ని పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2020-02-29T00:03:19+05:30 IST
కొండవీటి, పాలవాగు పనుల్ని పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు 4 వారాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
అమరావతి: కొండవీటి, పాలవాగు పనుల్ని పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు 4 వారాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రెండు వాగుల పనుల్ని మధ్యలోనే నిలిపివేయడం వల్ల పలు రాజధాని గ్రామాలు ముంపునకు గురవుతాయని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా పనులు చేయడం లేదని హైకోర్టు దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. వివరణకు 2 వారాల గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే రెండు వారాల గడువును హైకోర్టు నిరాకరించింది. 4 వారాల్లో ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని న్యాయమూర్తి కోరారు. 4 వారాల్లో అమలు చేసి నివేదిక ఇవ్వాలని, లేకపోతే సీఆర్డీఏ కమిషనర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.