కులాల గురించి సీఎం మాట్లాడడం విడ్డూరం: కనపర్తి శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2020-12-27T14:40:33+05:30 IST

కులాల గురించి సీఎం జగన్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా..

కులాల గురించి సీఎం మాట్లాడడం విడ్డూరం: కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు(ఆంధ్రజ్యోతి): కులాల గురించి సీఎం జగన్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస రావు అన్నారు. పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం నియమించిన 12 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల్లో పదిమందిని తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకున్న సీఎం జగన్‌ కుల సమతుల్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు.


సొంత సామాజికవర్గానికి చెందిన 700మందిని కీలక పోస్టుల్లో నియమిం చుకున్న ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుం దన్నారు. 35 మంది సీఎం సలహా దారుల్లో 26మంది సీఎం సామాజిక వర్గం వారు కాదా అని ప్రశ్నించారు.  చంద్రబాబు హయాంలో బాలయోగి, లాల్‌జాన్‌ బాషా, ఎర్రన్నాయుడు, ప్రతిభా భారతి, ఉమ్మారెడ్డి, మాధవరెడ్డి, యన మల వంటి వారిని అందలం ఎక్కిస్తే జనగ్‌ తన హయాంలో విజయ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామ కృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలాంటి వారిని అంద లం ఎక్కిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2020-12-27T14:40:33+05:30 IST