చంద్రబాబుపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు సరికాదు

ABN , First Publish Date - 2020-12-14T05:01:22+05:30 IST

మూడుసార్లు ఎమ్మెల్యేగా పీలేరులో ఓడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ఎక్కడా గెలవలేడని మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.

చంద్రబాబుపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు సరికాదు

కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): మూడుసార్లు ఎమ్మెల్యేగా పీలేరులో ఓడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ఎక్కడా గెలవలేడని మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు 7సార్లు భారీ మెజార్టీతో గెలిచిన విషయాన్ని పెద్దిరెడ్డి మర్చిపోయినట్లున్నారన్నారు. 27 ఎర్రచందనం కేసుల్లో ముద్దాయిగా ఉన్న అంతర్జాతీయ నేరస్థుడు కొల్లం గంగిరెడ్డితో కలిసి అక్రమ సంపాదనకు అలవాటు పడిన పెద్దిరెడ్డి కుటుంబం నేడు నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం హాస్యాస్పదనమని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ప్రశాంతంగా ఉన్న చిత్తూరు జిల్లా నేడు పెద్దిరెడ్డి అండదండలతో స్మగ్లింగ్‌, భూదందాలు హత్యలతో అట్టుడికిపోతుందన్నారు. అలానే దళితులను కించపరచటం ఆయనకు అలవాటుగా మారిందని తెలిపారు. ఇకనైనా మంత్రి పెద్దిరెడ్డి స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుందని కనపర్తి హితవు పలికారు.


Updated Date - 2020-12-14T05:01:22+05:30 IST