యువత కళారంగాన్ని ఆదరించి కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2020-12-27T05:22:11+05:30 IST

యువత నాటక ప్రదర్శనలు ఆదరించి కళారంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అన్నారు.

యువత కళారంగాన్ని ఆదరించి కాపాడుకోవాలి
బీవీఏ నాయుడుకు ఏవీ సుబ్బారావు పురస్కారంతో సత్కరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ తదితరులు

సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌

ఏవీ సుబ్బారావు దశమ అవార్డు బీవీఏ నాయుడుకు ప్రదానం

తెనాలి కొత్తపేట, డిసెంబరు 26 : యువత నాటక ప్రదర్శనలు ఆదరించి కళారంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అన్నారు.  పట్టణంలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం రాత్రి ఏవీ సుబ్బారావు దశమ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి సబ్‌ కలెక్టర్‌ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ప్రముఖ రంగస్థల నటుడు బీవీఏ నాయుడుకు ఏవీ సుబ్బారావు పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం అంతర్జాతీయ రంగస్థల నటుడు ఆరాధ్యుల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో సబ్‌ కలెక్టర్‌ ప్రసంగిస్తూ తాను జన్మించిన మహారాష్ట్రలో నాటక ప్రదర్శనలు తిలకించాలంటే తగిన ధర చెల్లించి టిక్కెట్‌ తీసుకోవాలని, కానీ ఇక్కడ కళాకారులు కళారంగ మనుగడను కాపాడుకునేందుకు ఉచిత నాటక ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్యారిస్‌ నగరం ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతుంటే, ఆంధ్రా ప్యారిస్‌గా ఖ్యాతినర్జించిన తెనాలి కూడా సాంస్కృతిక పట్టణం, కళల కాణాచిగా విరాజిల్లుతుందన్నారు. తొలుత పూర్ణశ్రీ నాట్య కళా సమితి వారిచే గయోపాఖ్యానం (యుద్ద సన్నివేశం), చింతామణి (భవానీ సన్నివేశం), శ్రీరామాంజనేయ యుద్దం (యుద్ద సన్నివేశం) ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రంగస్థల, సినీ నటుడు నాయుడు గోపి, వేమూరి విజయభాస్కర్‌, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణశెట్టి, ఏవీ ఆదినారాయణరావు, ఎ.నాగరాజు, రాజశేఖర్‌, టీవీఎస్‌ శర్మ, అయినాల మల్లేశ్వరరావు, కె.మల్లేశ్వరరావు, కె.గోవిందరాజులు, ఎ.రామదాసు, భాస్కర్‌ తదితరులు ప్రసంగించారు. 

Updated Date - 2020-12-27T05:22:11+05:30 IST