అక్రిడిటే షన్‌ కమిటీలో జర్నలిస్టులకు స్థానం కల్పించాలి

ABN , First Publish Date - 2020-12-15T05:43:51+05:30 IST

ప్రభుత్వం నియమించిన నూతన అక్రిడిటేషన్‌ కమిటీలో జర్నలిస్టులకు స్థానం కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు భాస్కరరెడ్డి డిమాండ్‌ చేశారు.

అక్రిడిటే షన్‌ కమిటీలో జర్నలిస్టులకు స్థానం కల్పించాలి

కలెక్టరేట్‌ ఎదుట నిరసన


గుంటూరు(తూర్పు), డిసెంబరు14: ప్రభుత్వం నియమించిన నూతన అక్రిడిటేషన్‌ కమిటీలో జర్నలిస్టులకు స్థానం కల్పించాలని  ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు భాస్కరరెడ్డి డిమాండ్‌ చేశారు.  సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఏపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే అక్రిడిటేషన్‌ కమిటీ కోసం తీసుకువచ్చిన జీవోనెం 142ను ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు నాగుల్‌మీరా, జిల్లా ఉపాధ్యక్షుడు కె.రమేష్‌బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భక్తవత్సలం, పలువరు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T05:43:51+05:30 IST