సచివాలయాల సిబ్బంది పనితీరు మెరుగుపర్చుకోవాలి

ABN , First Publish Date - 2020-11-13T06:07:09+05:30 IST

సచివాలయాల సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను నేరవేర్చాలని గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు.

సచివాలయాల సిబ్బంది పనితీరు మెరుగుపర్చుకోవాలి
పొన్నూరు సాంబశివనగర్‌లోని వార్డు సచివాలయాలను తనిఖీచేసి సిబ్బందికి సూచనలిస్తున్న జాయింట్‌కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

పొన్నూరు, నవంబరు 12: సచివాలయాల సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రభుత్వం ఆశించిన  లక్ష్యాలను నేరవేర్చాలని గుంటూరు  జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. గురువారం స్థానిక సాంబశివనగర్‌లోని వార్డుల సచివాలయాలను  ఆయన తనిఖీ చేశారు. సచివాలయాల సిబ్బంది పనితీరు పరిశీలించారు.  ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారులకు తెలియచేయటంతో పాటు వాటి  పరిష్కారం దిశగా పనిచేయాలని కోరారు. సచివాలయ సిబ్బంది సమిష్టి బాధ్యత వహించి  పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో తహసీల్ధార్‌ డి.పద్మనాభుడు, మున్సిపల్‌ కమిషనరు పి.వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ ప్రసాద్‌, మహేష్‌బాబు, వీఆర్వో ఆర్‌ క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T06:07:09+05:30 IST