విజయకీలాద్రిపై వైభవంగా గోదాదేవి అష్టోత్తర పూజ

ABN , First Publish Date - 2020-12-30T06:03:04+05:30 IST

తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీత్రిదండి చినజీయర్‌స్వామి, శ్రీత్రిదండి అహోబిల జీయర్‌ స్వామివార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో మంగళవారం ధనుర్మాస మహోత్సవాలు 14వ రోజు వైభవంగా జరిగాయి.

విజయకీలాద్రిపై వైభవంగా గోదాదేవి అష్టోత్తర పూజ
గోదాదేవికి అష్టోత్తర పూజ చేస్తున్న చినజీయర్‌ స్వామి

తాడేపల్లి టౌన్‌, డిసెంబరు 29: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీత్రిదండి చినజీయర్‌స్వామి, శ్రీత్రిదండి అహోబిల జీయర్‌ స్వామివార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో మంగళవారం ధనుర్మాస మహోత్సవాలు 14వ రోజు వైభవంగా జరిగాయి. గోదా అష్టోత్తరంతో ఉదయం కార్యక్రమం ప్రారంభం కాగా, పాశుర విన్నపం, తీర్థ ప్రసాదగోష్టి నిర్వహించారు. భక్తులకు చినజీయర్‌స్వామి మంగళశాసనాలు అందించారు. జీయర్‌ ఆశ్రమ నిర్వాహకులు వెంకటాచార్యులు, వేదవిద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T06:03:04+05:30 IST