మట్టి స్వాహా.. చేబ్రోలు క్వారీల్లో గ్రావెల్‌ దొంగలు

ABN , First Publish Date - 2020-12-12T05:16:35+05:30 IST

చేబ్రోలు మండలం మట్టి అక్రమాలకు కేంద్రంగా మారింది. చేబ్రోలు, వడ్లమూడి, శేకూరు, వీరనాయకునిపాలెం, సుద్ధపల్లి, వేజండ్ల తదితర గ్రామాలో ఎర్ర మట్టి క్వారీలు ఉన్నాయి. స్వల్ప భూమిలో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు మైనింగ్‌, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు పొందుతున్నారు. వాటిని అడ్డం పెట్టుకుని నిబంధనలను తోసిపుచ్చి యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ చేస్తున్నారు.

మట్టి స్వాహా.. చేబ్రోలు క్వారీల్లో గ్రావెల్‌ దొంగలు
వందల అడుగు తవ్వకాలు సాగించిన అక్రమాలకు నిదర్శనం ఈ చిత్రం

నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌

యథేచ్ఛగా ప్రకృతి సంపద తరలింపు

ప్రభుత్వ పనుల ముసుగులో తవ్వకాలు

స్థానిక నేతకు ట్యాక్స్‌ కడితేనే అనుమతులు


 ఎంతో నాణ్యమైన ఎర్ర మట్టి క్వారీలకు చేబ్రోలు మండలం నిలయం. ఇక్కడ లభించే ఎర్ర మట్టికి జిల్లా వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. దీంతో మండలంలోని ఎర్ర మట్టి, గ్రావెల్‌ క్వారీలు అక్రమార్కుల పాలిట కల్ప వృక్షాలుగా మారాయి.  ప్రభుత్వ పనుల ముసుగులో ప్రకృతి సంపదను యథేచ్ఛగా స్వాహా చేసేస్తున్నారు. అయితే స్థానిక నేతలకు ట్యాక్స్‌ చెల్లిస్తే అక్రమాలకు అడ్డుపడే వాడు ఉండరు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు.. తరలింపు జరుగుతున్నా గ్రామస్థులు, రైతుల ఆవేదన, ఆందోళనను పట్టించుకునే వారే లేరు.


తెనాలి, డిసెంబరు 11: చేబ్రోలు మండలం మట్టి అక్రమాలకు కేంద్రంగా మారింది. చేబ్రోలు, వడ్లమూడి, శేకూరు, వీరనాయకునిపాలెం, సుద్ధపల్లి, వేజండ్ల తదితర గ్రామాలో ఎర్ర మట్టి క్వారీలు ఉన్నాయి. స్వల్ప భూమిలో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు మైనింగ్‌, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు పొందుతున్నారు. వాటిని అడ్డం పెట్టుకుని నిబంధనలను తోసిపుచ్చి యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ చేస్తున్నారు. ఎకరా భూమికి అనుమతి పొంది సమీపంలోని పదుల ఎకరాల్లోని పోరంబోకు స్థలాల్లో మైనింగ్‌కు పాల్పడుతున్నారు. క్వారీల ప్రాంతంలోని పెద్దపెద్ద లోయలను చూస్తే ఏ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరిగాయో సులభంగా అర్థమవుతుంది. ఆరు మీటర్ల మించి తవ్వకాలు సాగించకూడదని మైనింగ్‌ నిబంధనలున్నా పట్టించుకునే వారే లేరు. భారీ వర్షాల సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అక్రమ మైనింగ్‌ జోరుగా సాగుతుంది. వందల అడుగుల లోతులో మైనింగ్‌ జరగటంతో భూగర్భ జలాలు అడుగంటి పోతాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నా రు. కార్వీ భూములకు సమీపంలోని పంట పొలాలు కోతకు గరవుతున్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


జడ్పీ భూముల్లో నిబంధనల ఉల్లంఘన

వడ్లమూడి క్వారీలో ప్రసిద్ధి చెందిన శ్రీ బాలకోటేశ్వరస్వామి ఆలయం ఎదుట జిల్లా పరి షత్‌కు 30 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ దశాబ్దాకాలం క్రితమే ప్రభుత్వ అవసరాలకు 10 నుంచి 15 మీటర్ల లోతు మేర గ్రావెల్‌ను తవ్వారు. ప్రస్తుతం ఈ భూముల్లో ప్రభుత్వ పనుల పేరుతో మైనింగ్‌ చేపట్టారు. స్థలాల లే అవుట్ల చదును, రోడ్ల నిర్మాణాల కోసం ఈ గ్రావెల్‌ను వినియోగించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. వాటిని అడ్డంపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు తవ్వి తరలి స్తున్నారు. ప్రధాన రహదారి తెనాలి, నారాకోడూరు రోడ్డు ఈ భూములకు 10 అడుగుల దూరం ఉంటే మరోవైపు రైల్వే లైన్‌ ఉంది. అయినా వందల అడుగుల లోతున నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ సాగిస్తున్నారు. ఈ భూముల్లో మట్టి పొరలు గట్టిగా ఉండటంతో బ్లాస్టింగ్‌ చేసి మరీ తవ్వకాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 


స్థానిక నేతల ఆదేశాలతో క్వారీయింగ్‌

ఏడాదిన్నర క్రితం మూతపడిన చేబ్రోలు క్వారీలు స్థానిక నేత ఆదేశాలతో ప్రారంభమ య్యా యి. ఎర్ర మట్టి తవ్వకాలకు ఎకరానికి రూ.25 నుంచి 30 లక్షలు చెల్లించాలని ఆ నేత నుంచి ఆదేశాలు వచ్చినట్లు క్వారీ యజమానులు బాహాటంగా చెబుతున్నారు. వడ్లమూడిలో స్థానిక నేత కనుసన్నల్లో మైనింగ్‌ సాగుతున్నట్లు ఆరోప ణలున్నాయి. వడ్లమూడిలో ఓ హాస్టల్‌ నిర్వాహకులు, మరో ధాన్యం వ్యాపారి కలిసి మైనింగ్‌ చేస్తున్నారని స మాచారం. శేకూరులో రెండు ప్రాంతాల్లో, వీరనాయకునిపాలెంలో ఒకదగ్గర మైనింగ్‌ జరుగుతోంది. ఓ నేత ముఖ్య అనుచరుడి కను సన్నల్లో వీరనాయకునిపాలెంలో మైనింగ్‌ సాగుతుందని గ్రా మస్థులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవల్సిన అధికార యంత్రాంగం అక్రమార్కులకే వంతపాడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల అక్రమ మైనింగ్‌పై విమర్శలు రావటంతో అడ్డుకోబోయిన  ఒక అధికారిని సైతం బదిలీ చేశారంటే మైనింగ్‌ అక్రమార్కుల లా బీయింగ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 


-  సుద్ధపల్లి, వేజెండ్ల గ్రామాల్లోని క్వారీ గుంతల్లో పడి 2011లో ఇద్దరు చిన్నారులు చనిపోవ డంతో అప్పటి కలెక్టర్‌       ప్రాంతంలో క్వారీ యింగ్‌ను నిషేధించారు. అయితే ప్రస్తుతం ఈ భూముల్లో క్వారీంగ్‌ చేయాలని గుంటూరుకు చెంది      న ఓ నేత ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.  


 - అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసే వారిని ఓ  అధికారి బెదిరిస్తున్నట్లు ఆరోపణలు న్నాయి. ఈ అధికారికి ఓ క్వారీలో      మైనింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేసుకునే కాంట్రాక్ట్‌ ఉంది. దీంతో ఆ అధికారి మైనిం గ్‌ మాఫియాకి అండ గా         ఉన్నట్లు  చేబ్రోలు వాసులు ఆరోపిస్తున్నారు.


నెలకు లారీకి..10 వేలు

చేబ్రోలు పరిసర  ప్రాంతాల్లో గ్రావెల్‌ లారీలు తిరిగేందుకు వాటి యజమానులు స్థానిక నేతకు నెలకు  రూ.10 వేలు చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-12-12T05:16:35+05:30 IST