వస్తువుల నాణ్యత బాధ్యత వినియోగదారులదే

ABN , First Publish Date - 2020-12-25T05:44:34+05:30 IST

తమ దైనందిన జీవితంలో వస్తువులను ఎంపిక చేసుకోవడం. వాటి నాణ్యత, భద్రత, వాటి మీద ఉన్న సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత వినియోగదారులదేనని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ స్పష్టంచేశారు.

వస్తువుల నాణ్యత బాధ్యత వినియోగదారులదే
సమావేశంలో ప్రసంగిస్తున్న జేసీ దినేష్‌కుమార్‌

జేసీ దినేష్‌కుమార్‌

గుంటూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తమ దైనందిన జీవితంలో వస్తువులను ఎంపిక చేసుకోవడం. వాటి నాణ్యత, భద్రత, వాటి మీద ఉన్న సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత వినియోగదారులదేనని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ స్పష్టంచేశారు. గురువారం సాయంత్రం పాతగుంటూరు రైతుబజార్‌లో పౌరసరఫరాలశాఖ, జిల్లా వినియోగదారుల సమాచారకేంద్రం ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తొలుత రైతుబజార్‌ ఆవరణలో తూనికలు, కొలతలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ని జేసీ పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజులలో ఈ-కామర్స్‌ ద్వారా వినియోగదారులు వస్తువులు ఆన్‌లైన్‌లో బుకింగ్‌చేసి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అవి వినియోగదారునికి చేరిన తర్వాత సదరు కంపెనీ ద్వారా పంపే వస్తువులలో నాణ్యత ప్రమాణాలు లేకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలనే సందిగ్ధం నెలకొని ఉందన్నారు. వినియోగదారులచట్టం, హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు మోసపూరిత ప్రకటనలు చూసి మోసపోతోన్నారని చెప్పారు. లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్‌ ఎం.కాంతారావు మాట్లాడుతూ వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ప్యాకేజ్డ్‌ కమోడిటిఈస్‌ ప్రతీ ప్యాకేజ్‌ పైన తయారీదారుని పూర్తి చిరునామా, వస్తువు వివరాలన్ని ఉన్నాయ, లేవో గమనించి కొనుగోలు చేయాలన్నారు. జాయింట్‌ కంట్రోలర్‌ రాంకుమార్‌, జిల్లా వినియోగదారుల ఫొరం మాజీ అధ్యక్షుడు పీవీఎస్‌ మూర్తి, కన్యూమర్‌ కో-ఆర్డినేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు చదలవాడ హరిబాబు తదితరులు మాట్లాడారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ, వినియోగదారుల యాక్టివిస్టు దాసరి ఇమ్మానియేల్‌, ఆదం సాహెబ్‌, చేకూరి రాజశేఖర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-25T05:44:34+05:30 IST