మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ : జంగాల

ABN , First Publish Date - 2020-12-20T05:04:12+05:30 IST

దేశంలో బీజేపీ మతపరమైన రాజకీ యాలు చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ అన్నారు.

మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ : జంగాల
మాట్లాడుతున్న జంగాల అజయ్‌కుమార్‌

పొన్నెకల్లు(తాడికొండ), డిసెంబరు 19: దేశంలో బీజేపీ మతపరమైన రాజకీ యాలు చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ అన్నారు. మండల పరిధిలోని పొన్నె కల్లు సీపీఐ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమా వేశం శనివారం జరిగింది. సమావేశానికి సీపీఐ మండ ల కార్యదర్శి ముప్పాళ్ల శివశంకరరావు అధ్యక్షత వహించారు. ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న దీక్షల సందర్భంగా మరణించిన రైతులకు సంఘీభావంగా, అమరావతి రాజధానిలో మరణించిన రైతులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.  అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ మోదీ నిర్ణయాలతో ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ అరాచక పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు.  ఈనెల 21న టిడ్కో గృహాల విషయమై విజయ వాడలో జరిగే సమావేశానికి లబ్దిదారులు హజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబొతు ఈశ్వరరావు, జీవీ.రాజు, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more