ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-19T08:02:40+05:30 IST

ఇంటర్‌మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. దీంతో విద్యా ర్థుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయు. పరీక్ష రాసి వస్తున్న బస్సుల్లో కోలాహల వాతావరణం నెలకొంది.

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

గుంటూరు (విద్య), మార్చి 18: ఇంటర్‌మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. దీంతో విద్యా ర్థుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయు. పరీక్ష రాసి వస్తున్న బస్సుల్లో కోలాహల వాతావరణం నెలకొంది. పలు కేంద్రాల వద్ద విద్యార్థులు పాతనోట్‌ పుస్తకాలు, ప్రశ్న పత్రాలు చించి రోడ్డుపై వేస్తూ సందడిచేశారు. ఇదిలా వుంటే బుధవారం 134 కేంద్రాల్లో  జరిగిన పరీక్షకు మొత్తం 45,536 మందికి గాను 44,592 మంది హాజరయ్యారు. పరీక్షకు 1044 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యాకోర్సుల పరీక్షకు సంబంధించి 795 మందికి గాను 718మంది హాజరయ్యారు. పరీక్షకు 77మంది గైర్హాజరయ్యారు. గురజాల పరీక్ష కేంద్రంలో మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడు తున్న విద్యార్థిని గుర్తించి డీబార్‌ చేసినట్లు ఆర్‌ఐవో జడ్‌ఎస్‌ రామచంద్రరావు తెలిపారు. జిల్లాలో ఫ్లయింగ్‌, సిట్టింగ్‌, హైపవర్‌ కమిటీ, డీఈసీ సభ్యులు మొత్తం 34 కేంద్రాల్లో తనిఖీలు చేశారు. పరీక్షలు విజయ వంతంగా ముగియడంతో బుధవారం నుంచే విద్యార్థులు ఇంటిబాట పట్టారు. మరోవైపు కరోనా వైరస్‌ నేపథ్యంలో అనేక కళాశాలలు ముందుగానే విద్యార్థులకు సూచనలు చేశా యి. హాస్టళ్లు ఖాళీ చేసి ఈనెల  31వ తేదీ తరువాత కోచింగ్‌, ఇతర పరీక్షల కోసం రావా లని సూచించాయి. దీంతో బస్టాండు, రైల్వే స్టేషన్‌లలో విద్యా ర్థుల సందడి కనిపించింది. అనేకచోట్ల హాస్టళ్లకు తల్లిదండ్రులు రావడంతో వారితో కలిసి సామాన్లు సర్దుకుని సొంతూళ్ళ కు పయనమయ్యారు.

Updated Date - 2020-03-19T08:02:40+05:30 IST