ఇంటర్‌కు లైన్‌క్లియర్‌

ABN , First Publish Date - 2020-12-26T05:37:25+05:30 IST

కరోనా, హైకోర్టులో కేసు నేపథ్యంలో విద్యాసంవత్సరం మూడోంతులు పూర్తి అయినా.. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు చేపట్ట లేదు.

ఇంటర్‌కు లైన్‌క్లియర్‌

పాతపద్ధతిలోనే జూనియర్‌ అడ్మిషన్లు  

నెలాఖరులోగా ప్రథమ సంవత్సర షెడ్యూల్‌  

హైకోర్టు తీర్పుతోప్రవేశాలకు సిద్ధమైన అధికారులు 

సిలబస్‌ విషయంలో భారీగా కొత విఽధించే అవకాశం?


విద్యా సంవత్సరం మూడొంతులు ముగుస్తున్న పరిస్థితుల్లో జూనియర్‌ ఇంటర్‌ మీడియట్‌ అడ్మి షన్లకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు అడ్మిషన్ల వ్యవహారం ఒక కొలిక్కిరాక పోవడం తో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లకు అనుమతి వచ్చింది. హైకోర్టు తీర్పుతో నాలుగైదు రోజుల్లో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు నిర్వహించడానికి అధి కారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఇంటర్‌ బోర్డు త్వరలో విడుదల చేయనున్నది. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాల లు సుమారు 280 వరకు ఉన్నాయి. ఈ    విద్యా సంవత్సరం మరో 11 కళాశాలలు కొత్తగా ప్రారంభం కానున్నాయి. 


గుంటూరు(విద్య), డిసెంబరు 25: కరోనా, హైకోర్టులో కేసు నేపథ్యంలో విద్యాసంవత్సరం మూడోంతులు పూర్తి అయినా.. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు చేపట్ట లేదు. దీంతో జిల్లాలో దాదాపు 55 వేల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థి తుల్లో ఇంటర్‌ ప్రవేశాలకు సంబంధించి గురువారం హైకో ర్టు తీరు ఇచ్చింది. అయితే ఈ ఏడాదికి పాత పద్ధతి లోనే అడ్మిషన్లు నిర్వహించాలని కోర్టు సూచించింది. దీంతో సమస్య కొలిక్కివచ్చింది. ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల మాదిరిగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్‌ మీడి యట్‌ ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం నూతన విధానం తీసుకువచ్చింది. మరోవైపు ఇప్పటి దాకా ఒక సెక్షన్‌లో 88 మంది వరకు విద్యార్థులను కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలు చేర్చుకునే అవకాశం ఉండేది. తాజాగా ప్రభుత్వం సవ రించిన విధానంలో ఈ సంఖ్య 40కి పరిమితం చేశారు. ఆన్‌ లైన్‌లో కొన్ని కళాశాలల్ని మాత్రమే చేర్చారు. హాస్టల్స్‌ నిర్వహణ, కొత్త సెక్షన్‌లో విద్యార్థులను చేర్చుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. ప్రభు త్వం ఫీజులు నిర్ణయించింది. ఈ నిబంధన లపై ప్రైవేటు, కార్పొరేట్‌ కళా శాలల యాజ మాన్యాలు తీవ్ర అసంతృప్తితో కోర్టును ఆశ్ర యించాయి. దీంతో అడ్మిషన్లకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.


అనధికారికంగా 50 శాతం సిలబస్‌ పూర్తి

ఇంటర్‌ అడ్మిషన్లపై వివాదం నెలకొన్నా అనేక ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు ఇప్పటికే అనఽధికారికంగా ఆన్‌లైన్‌ పద్ధతిలో 50శాతం సిలబస్‌ పూర్తిచేసినట్లు సమాచారం. పది ఫలి తాలు రాగానే వారు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారం భించి ఆన్‌లైన్‌ క్లాసులు చేపట్టినట్లు తెలిసింది. అడ్మిషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చినందున సెల వుల్ని రద్దు చేసుకుని నిర్ధేశించిన ప్రకారం సిల బస్‌ పూర్తిచేయాలనే ఆలోచనతో కళాశాలల ని ర్వాహకులు ఉన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ఇంకా తేలలేదు. 


ద్వితీయ సంవత్సరం సిలబస్‌ 80 శాతం పూర్తి

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిల బస్‌ ఏటా డిసెంబరు ఆఖరు నాటికి పూర్తి అవు తుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్ర వరి మొదటి వారంలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరు గుతాయి. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యం లో ఈ ప్రక్రి యలో కొద్దిగా మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు  ఫిబ్ర వరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నారు. ఆ తరువాత వారికి ఫైనల్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రం వచ్చే ఏడాది జూన్‌, జూలైలోనే పరీక్షలు జరిగే అవకాశం ఉందని సమాచారం. సిలబస్‌ విష యంలో భారీగా కొత విఽధిం చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Updated Date - 2020-12-26T05:37:25+05:30 IST