హైదరాబాద్‌కు.. రైట్ రైట్
ABN , First Publish Date - 2020-11-03T14:10:29+05:30 IST
ఏపీ నుంచి తెలంగాణకు ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులకు..
తొలిరోజు రీజియన్ నుంచి 13 బస్సులు
నేటి నుంచి సాధారణ షెడ్యూల్ సర్వీసులు
ఆన్‌లైన్‌లో టిక్కెట్ల రిజర్వేషన్‌కు అవకాశం
గుంటూరు: ఏపీ నుంచి తెలంగాణకు ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులకు లైన్ క్లియర్ కావడంతో తొలి రోజు సోమవారం గుంటూరు నుంచి హైదరా బాద్‌కు 13 సర్వీసులు ప్రారంభమ య్యాయి. సోమవారం రాత్రి 8.30 గంటలకు బాపట్ల డిపో నుంచి సూపర్ లగ్జరీ సర్వీసు హైదరాబాద్‌కు బయల్దే రగా రాత్రి 10 గంటలకు గుంటూరు 2 డిపో నుంచి బస్సులు ప్రారంభమయ్యా యి. రీజియన్ నుంచి 13 సర్వీసులు కాగా గుం టూరు -2 డిపో నుంచి 3, రేపల్లె 1, తెనాలి 1, బాపట్ల 1, పొన్నూరు 1, నరసరావుపేట 1, మాచర్ల 2, చిలకలూరిపేట 1, సత్తెనపల్లి 1, వినుకొండ 1 సర్వీసులు ప్రారంభమ య్యాయి. కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్ ప్రాంతాలకు సర్వీసులు బయల్దేరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మంగళవారం ఉదయం నుంచి భద్రాచలానికి ఒక సర్వీసు ప్రారంభమవుతుందన్నారు. మంగళవారం రాత్రి నుంచి రీజియన్ వ్యాప్తంగా 61 సర్వీసులు రాకపోకలు సాగించేలా షెడ్యూల్ రూపొందించినట్లు ఇన్‌చార్జి ఆర్‌ఎం శరత్‌బాబు తెలిపారు. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. గతంలో 101 బస్సులు నడపగా ప్రస్తుతం 61 బస్సులు మాత్రమే షెడ్యూల్ రూపొందించామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతామన్నారు.